రూ.లక్షలు వెచ్చించినా నెరవేరని లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-20T05:28:45+05:30 IST

పట్టణంలోని మెయినరోడ్డు ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి రాయలసీమ సర్కిల్‌ వరకు నూతనంగా నాలుగులైన్ల రోడ్డు వేశారు. మధ్యలో డివై డర్లను మూడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు.

రూ.లక్షలు వెచ్చించినా నెరవేరని లక్ష్యం
స్థానిక మున్సిపల్‌ వాటర్‌ ట్యాంక్‌ ఆవరణలో వృఽథాగా పడి ఉన్న చెట్లు

       

 డివైడర్ల కోసం తెచ్చిన చెట్లు వృఽథా 

 పనికి రావంటూ పక్కన పెట్టిన వైనం 

కదిరి, సెప్టెంబరు 19: పట్టణంలోని మెయినరోడ్డు ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి రాయలసీమ సర్కిల్‌ వరకు నూతనంగా నాలుగులైన్ల రోడ్డు వేశారు. మధ్యలో డివై డర్లను మూడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఈ డివైడర్లలో నాటడానికి మొ క్కలు తెప్పించేందుకు రూ.1.60లక్షలతో టెండర్లు వేశారు. తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన వ్యక్తి టెండర్లలో పా ల్గొని అవసరమైన మొక్కలు సరఫరా చేశా రు. అయితే కాంట్రాక్టర్‌ మొక్కలను కా కుం డా దాదాపు 10 అడుగులకు పైగా ఉన్న చెట్లను సరఫరా చేశారు. ఇంజనీర్లు వాటిని చూసుకోకుండా వాటర్‌ ట్యాంక్‌ ఆవరణలో నిలువ చేశారు. అయితే డివై డర్లు మూడు అడుగుల ఎత్తు ఉండడం వలన.. దానిపై పది అడుగుల చెట్లు పెడితే కొన్ని రోజులకు అవి మహా వృక్షాలై ప్రజలు ఇబ్బంది పడే అవకాశముందని స్థానిక ప్రజాప్రతినిధి వాటిని డివైడర్లలో పెట్టకూడదని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వాటిని వాటర్‌ ట్యాంక్‌ ఆవరణలోనే వదిలేశారు. రూ.లక్షలు పెట్టినా  డివైడర్లలో మొక్కలు నాటా లన్న మున్సిపల్‌ అధికారుల లక్ష్యం నెరవేరలేదు. మరో వైపు ఆ చెట్ల కొనుగోలుకు డబ్బు వృథా అయింది. డివైడర్లు ఖాళీగానే ఉన్నాయి.

 ఈ విషయంపై మున్సిపల్‌ ఏఈ సుదర్శనను వివరాణ కోరగా... డివైడర్లల్లో మొక్కలు నాట్టడానికి టెండర్లు పిలిచామని, అయితే కాంట్రా క్టర్‌ మొక్కలు కాకుండా చెట్లు సరఫరా చేశారన్నారు. దీంతో వాటిని అక్కడ నాటలే దన్నారు. అదే చెట్లను మరో చోట నాటుతామని డివైడర్లల్లో పెంచేందుకు మొక్కలు తెప్పిస్తామన్నారు. డబ్బు వృఽథాపై ఆయన సమాధానం దాట వేశారు. 

Updated Date - 2022-09-20T05:28:45+05:30 IST