వైపీపీ పాలనలో అన్ని భారాలే

ABN , First Publish Date - 2022-11-17T00:12:18+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై అన్ని రకాలుగా ఆర్థిక భారం మోపుతోందని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షు రాలు, మాజీ మేయర్‌ స్వరూప మండిపడ్డారు.

వైపీపీ పాలనలో అన్ని భారాలే

అనంతపురం అర్బన, నవంబరు 16: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై అన్ని రకాలుగా ఆర్థిక భారం మోపుతోందని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షు రాలు, మాజీ మేయర్‌ స్వరూప మండిపడ్డారు. బుధవారం స్థానిక 30వ డివిజనలో ఇంటింటికీ తిరుగుతూ మహిళలతో మాటా - మంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ హయాంలో మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు కల్పించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలపై మహిళలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడును తిరిగి సీఎంగా చేయడం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రంగమ్మ, తెలుగు మహిళలు లక్ష్మి, రాజేశ్వరి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:12:18+05:30 IST

Read more