‘బ్యాంక్‌ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2022-09-09T05:05:15+05:30 IST

రైతుల పేరుతో రుణాలను స్వాహా చేసిన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ పెంచలరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆర్సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

‘బ్యాంక్‌ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి’

అమడగూరు, సెప్టెంబరు 8: రైతుల పేరుతో రుణాలను స్వాహా చేసిన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ పెంచలరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆర్సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం తహసీల్దార్‌ కార్యాయం వద్ద ధర్నా చేసి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో అమడగూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న పెంచలరెడ్డి రైతుల పేర్లతో దాదాపు రూ.80లక్షలు మంజూరు చేసుకుని స్వాహా చేసినట్లు చెప్పారు. రైతుల డబ్బులను స్వాహా చేయడం వలన, బ్యాంక్‌ అధికారులు రుణాలు కట్టాలని రైతులకు నోటీలు జారీ చేయడం అన్యామన్నారు. అనంతరం సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు మున్నా, రామచంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Read more