మూడు హత్య కేసుల్లో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-12-10T00:22:37+05:30 IST

మూడు హత్య కేసుల్లో నిందితుడు ఈర నాగన్నను కంబదూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడు ఏకంగా 26 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. కంబదూరు మండలం గొల్లపల్లి, పాళ్లూరు గ్రామ పొలాల్లో 1996లో మూడు హత్యలు జరిగాయి. ఈ కేసులో కంబదూరు మండలం గొల్లపల్లికి చెందిన గొల్ల ఈర నాగన్న ఏ-6 ముద్దాయి అని ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

మూడు హత్య కేసుల్లో నిందితుడి అరెస్టు
గొల్ల ఈర నాగన్న (ఫైల్‌)

26 సంవత్సరాలుగా పరారీలో..

కంబదూరు (కళ్యాణదుర్గం), డిసెంబరు 9: మూడు హత్య కేసుల్లో నిందితుడు ఈర నాగన్నను కంబదూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడు ఏకంగా 26 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. కంబదూరు మండలం గొల్లపల్లి, పాళ్లూరు గ్రామ పొలాల్లో 1996లో మూడు హత్యలు జరిగాయి. ఈ కేసులో కంబదూరు మండలం గొల్లపల్లికి చెందిన గొల్ల ఈర నాగన్న ఏ-6 ముద్దాయి అని ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు. కేసు నమోదయ్యాక ఈర నాగన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఏళ్లతరబడి ఆచూకీ లభించలేదు. దీంతో కోర్డు లాంగ్‌ పెండింగ్‌ కేసుగా పరిగణించింది. నిందితుడి ఆచూకీ కనుగొని అరెస్టు చేయాలని ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశించారు. దీంతో డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. బెంగళూరులో తలదాచుకున్న నిందితుడు, తరచూ గ్రామానికి వచ్చివెళుతున్నట్లు గుర్తించారు. గొల్లపల్లికి రాగానే నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. కళ్యాణదుర్గం రూరల్‌ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ రాజేష్‌ ఆధ్వర్యంలో నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-12-10T00:22:41+05:30 IST