చోరీ కేసు నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-12-13T23:58:19+05:30 IST

పరిగి మండలంలోని పలు ఇళ్లలో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరె్‌స్ట చేశారు.

చోరీ కేసు నిందితుడి అరెస్ట్‌

47 గ్రాముల బంగారం, రూ.60 వేల నగదు స్వాధీనం

పరిగి, డిసెంబరు 13: మండలంలోని పలు ఇళ్లలో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరె్‌స్ట చేశారు. వివరాలను ఎస్‌ఐ నరేంద్ర విలేకరులకు తెలిపారు. మండలంలోని బీచిగానిపల్లికి చెందిన ప్ర భాకర్‌ పరిగిలో ఏడాదిక్రితం ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. అదేవిధంగా గత వారం బీచిగానిపల్లిలో ఓ ఇంట్లో చోరీ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మడకశిర-కొడికొండ జాతీయ రహదారి యర్రగుంట క్రాస్‌ వద్ద ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. 47 గ్రాముల బంగారు ఆభరణాలు, 148 గ్రాముల వెండి, రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకుని, అరెస్టు చేశామన్నారు.

Updated Date - 2022-12-13T23:58:19+05:30 IST

Read more