ట్రాక్టర్‌ కిందపడి విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-10-12T05:49:57+05:30 IST

మండలంలోని ఉద్దేహాళ్‌ గ్రామంలో ట్రాక్టర్‌ కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళ వారం సాయంత్రం చోటు చేసుకుంది.

ట్రాక్టర్‌ కిందపడి విద్యార్థి మృతి

 బొమ్మనహాళ్‌, అక్టోబరు 11: మండలంలోని ఉద్దేహాళ్‌ గ్రామంలో ట్రాక్టర్‌ కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళ వారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు తెలిపిన వివరాల మేరకు ట్రాక్టర్‌లో మొద్దులు లోడు చేసుకుని నాగలాపురం వైపు నుంచి వస్తూ ఉద్దేహాళ్‌లో ఆసిఫ్‌ కుమారుడు నవాజ్‌ (7) అనే విద్యార్థి రోడ్డు పక్కన వుండ గా ఢీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ పరార య్యాడు. ట్రాక్టర్‌ బళ్లారికి చెందిన దిగా స్థానికులు గుర్తించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.  

Read more