అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-30T04:43:10+05:30 IST

మండలంలోని గుండిగానిపల్లికి చెందిన పూజారి నీలేష్‌ (45) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది.

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
నీలేష్‌ మృతదేహం

 బ్రహ్మసముద్రం, సెప్టెంబరు 29: మండలంలోని గుండిగానిపల్లికి చెందిన పూజారి నీలేష్‌ (45) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడికి కుటుంబ సమస్యలతో పాటు, తమ్ముడు ధనుంజయ అనారోగ్యానికి రూ. 4 లక్షలు, వ్యవసాయ సాగుకు రూ. 5 లక్షలు అప్పులు చేశాడు. వాటి తీర్చే మార్గం కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన తన గడ్డివాములోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించి అప్పటికే మృతి చెందాడు. తల్లి నీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలిం చారు. మృతుడికి కొడుకు మహేష్‌ ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read more