నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2022-08-25T05:38:43+05:30 IST

మండల పరిధిలోని షేక్షానుపల్లి గ్రామంలో బుధవారం ఏడాదిన్నర వయస్సున్న ఓ చిన్నారి నీటి తొట్టెలో పడి మృతి చెందింది.

నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి

ఉరవకొండ, ఆగస్టు 24: మండల పరిధిలోని షేక్షానుపల్లి గ్రామంలో బుధవారం ఏడాదిన్నర వయస్సున్న ఓ చిన్నారి నీటి తొట్టెలో పడి మృతి చెందింది. దేవేంద్ర, సుహాసిని దంపతుల కుమార్తె అయిన గంగోత్రి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్న సమయంలో సమీపంలో ఉన్న తొట్టెలోకి పడి పోయింది. ఎంతసేపటికి కనిపించకపోవడంతో తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు వెతికారు. నీటి తొ ట్టెలో చిన్నారి ఉండటాన్ని గమనించి హుటాహుటినా ఉరవకొండ ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 


Read more