నీటితొట్టెలో పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2022-09-26T05:15:24+05:30 IST

మండలంలోని బ్రహ్మసముద్రం గ్రామానికి చెందిన వెంకటేష్‌, అశ్విని దంపతుల కుమార్తె శ్రావణీశ్రీ(2) ఆదివారం నీటితొట్టె లో పడి మృతి చెందింది.

నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
శ్రావణీశ్రీ మృతదేహం

సోమందేపల్లి, సెప్టెంబరు 25: మండలంలోని బ్రహ్మసముద్రం గ్రామానికి చెందిన వెంకటేష్‌, అశ్విని దంపతుల కుమార్తె శ్రావణీశ్రీ(2) ఆదివారం నీటితొట్టె లో పడి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరా లివి. గ్రామంలో పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటితొట్టెలో ప్రమాదవశాత్తు శ్రావణీశ్రీ పడిపోయింది. ఎవ రూ గుర్తించకపోవడంతో నీటిలో మునిగిపోయింది. కు టుంబ సభ్యులు, గ్రామస్థులు చిన్నారి కోసం పలుచోట్ల గాలించారు. చివరికి నీటి తొట్టెలో ఊపిరాడక మృతి చెందిన చిన్నారి మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. 


విద్యుదాఘాతంతో యువకుడు..

హిందూపురరం, సెప్టెంబరు 25: తూముకుంట పారిశ్రామిక వాడలోని అదిరి స్టీల్‌ పరిశ్రమలో ఆదివారం విద్యుత షాక్‌తో బీహార్‌కు చెంది న యువకుడు అజయ్‌ (25) మృతి చెందాడు. ఎస్‌ఐ కరీం తెలిపిన వివరాలివి. పరిశ్రమలో బీహార్‌కు చెందిన వారు పనిచేస్తున్నారు. అజయ్‌  కొ ద్దిరోజుల క్రితం పనిలో చేరాడు. సాయంత్రం స్నానం చేయడానికి వాటర్‌ ట్యాంకు వద్ద మోటాల్‌ ఆన చేస్తుండగా విద్యుత షాక్‌కు గురయ్యాడు.  ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Read more