కొడాలి నానిపై కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-09-14T04:56:08+05:30 IST

తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడు, నారా లోకేశపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని టీ డీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

కొడాలి నానిపై కేసు నమోదు చేయాలి
హిందూపురంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు

పోలీస్‌స్టేషనలో టీడీపీ నాయకుల ఫిర్యాదు 


హిందూపురం, సెప్టెంబరు 13: తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడు, నారా లోకేశపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని టీ డీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం టీడీపీ లీగల్‌సె ల్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు శివశంకర్‌ ఆధ్వర్యంలో వనటౌన పోలీస్‌ స్టేషనలో ఎస్‌ఐ జయరాములుకు ఫిర్యాదు చేశారు. ఈసందర్భం గా నాయకులు మాట్లాడుతూ నోటికి వచ్చిన రీతిలో చంద్రబాబు, నారాలోకేశలపై నోరుపారేసుకోవడం నాని పొగరుబోతుతనానికి ని దర్శనమన్నారు. స్థాయిని మరిచి వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రజలే ఆ యనకు బుద్ధి చెబుతారన్నారు. మతి భ్రమించి మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించా రు. కార్యక్రమంలో టీడీపీ లీగల్‌సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు రా మచంద్రప్ప, ఎస్టీ సెల్‌ వెంకటరమణ, నాయకులు మురళి, హిదాయతుల్లా, మంజునాథ్‌, అజ్మతుల్లా, ఫాజిల్‌, చింటు, ప్రకాష్‌, శ్రీనివాసరెడ్డి, మాధవ్‌ పాల్గొన్నారు. 


మహిళల జోలికొస్తే నాలుక కోస్తాం.. 

రొద్దం: నారా భువనేశ్వరీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాజీ మంత్రి కొడాలి నానికి నాలుక కోస్తామని హిందూపురం పార్లమెం ట్‌ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ హెచ్చరించారు. మంగళవారం నాని వ్యాఖ్యలను నిరసిస్తూ నాయకులు స్థానికంగా నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళలపై అసభ్యంగా మాట్లాడితే చూ స్తూ ఊరుకోమన్నారు. మంత్రి పదవి కోసం ఇష్టానుసారంగా మా ట్లాడితే మహిళలంతా సంఘటితమై తిరిగేసి కొండతామన్నారు.  కార్యక్రమంలో తెలుగు మహిళ నాయకురాలు లీలావతి, అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య, పెనుకొండ నియోజకవర్గ టీఎనటీయూసీ అధ్యక్షులు వాల్మీకి చంద్రశేఖర్‌, మాజీ సర్పంచ అశ్వర్థనారాయణ, మురళి, మాజీ ఎంపీటీసీ చం ద్రశేఖర్‌, బేల్దార్‌ కిష్టప్ప, నారాయణ, సురేష్‌ పాల్గొన్నారు. 


మాజీ మంత్రిని అరెస్ట్‌ చేయాలి 

పరిగి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నా యుడు, నారా లోకేశలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిని అరెస్టు చేయాలని మండల టీడీపీ నాయ కులు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషనలో ఏ ఎస్‌ఐ జయలతకు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ అధికార అహంతో నోటికొచ్చిన రీతిలో మాట్లాడటం ఎం తవరకు సమంజసమన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు లలితమ్మ, ప్రధాన కార్యదర్శి నరసింహులు, టీఎనఎ్‌సఎ్‌ఫ అధ్యక్షులు అచ్యుత, ఎస్సీసెల్‌ అధ్యక్షులు శ్రీనివాసులు, కమిటీ స భ్యులు అంజి, నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి అ నురాధ, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవమ్మ, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ బేబి, కార్యకర్తలు పాల్గొన్నారు. 


సోమందేపల్లి: నారాచంద్రబాబు నాయుడు కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్ట్‌ చేయాలని టీడీపీ మహిళా విభాగం సభ్యులు మంగళవారం పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. వెంటనే నానిని అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మహిళా నాయకులు మాట్లాడారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడునే నానా దుర్భాషలాడుతున్న కొడాలి నానికి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. రాబోవుకాలంలో అతనికి మహిళ లు బుద్ధి చెబుతారన్నారు. సభ్యత , సంస్కారం లేని ఇలాంటి వ్యక్తి ని చీపుర్లు తిరిగేసి కొట్టే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. కార్యక్రమంలో తెలుగునాడు అంగనవాడీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి, అనసూయమ్మ, సుజాతమ్మ, శారద, నాగమణి, లక్ష్మీ, టీడీపీ మం డల కన్వీనర్‌ సిద్దలింగప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read more