రైలు ఢీకొని 80 గొర్రెల మృతి

ABN , First Publish Date - 2022-11-23T00:02:48+05:30 IST

కొత్తచెరువు మండల సమీపంలోని లోచర్ల-గుంటిపల్లి మద్యలో మంగళవారం సాయంత్రం రైలు ఢీకొని 80 గొర్రెలు మృతిచెందాయి.

రైలు ఢీకొని 80 గొర్రెల మృతి

కొత్తచెరువు(బుక్కపట్నం), నవంబరు 22: కొత్తచెరువు మండల సమీపంలోని లోచర్ల-గుంటిపల్లి మద్యలో మంగళవారం సాయంత్రం రైలు ఢీకొని 80 గొర్రెలు మృతిచెందాయి. రైల్వేపోలీసులు తెలిపిన మేరకు... లోచర్ల గ్రామానికి చెందిన ఉంగర రామాంజనేయు లు, లక్ష్మీనారాయణ, ఉంగర నారాయణలు మేత కోసం ఉదయం మంగళవారం గ్రామ సమీపంలోకి తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికితోలుకొస్తుండగా మార్గమధ్యలో గొర్రెలు రైలు పట్టాలు దాటుతుండగా ధర్మవరం వైపు నుంచి వచ్చిన రైలు ఢీకొంది. ఈ ప్రమాదం లో 80 గొర్రెలు మృతిచెందినట్లు కాపరులు తెలిపారు. దాదాపు రూ.7లక్షలదాకా నష్టం వాటిల్లినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

Updated Date - 2022-11-23T00:02:48+05:30 IST

Read more