ఇంట్లో దూరి 18 తులాల బంగారం చోరీ

ABN , First Publish Date - 2022-12-10T00:26:28+05:30 IST

ఇనస్టాగ్రామ్‌లో ఓ బాలికతో పరిచయం పెంచుకున్న వ్యక్తి వారి ఇంట్లోకి చొరబడి 18 తులాల బంగా రం ఆభరణాలు చోరీ చేశాడు. అనంతపురం రూరల్‌ మండలం కందు కూరులో ఈ ఘటన జరిగింది

ఇంట్లో దూరి 18 తులాల బంగారం చోరీ
బంగారం ఆభరణాలను చూపుతున్న ఇటుకలపల్లి పోలీసులు

అనంతపురం క్రైం, డిసెంబరు9: ఇనస్టాగ్రామ్‌లో ఓ బాలికతో పరిచయం పెంచుకున్న వ్యక్తి వారి ఇంట్లోకి చొరబడి 18 తులాల బంగా రం ఆభరణాలు చోరీ చేశాడు. అనంతపురం రూరల్‌ మండలం కందు కూరులో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో ఇటుకలపల్లి పోలీసులు జిల్లాలోని పుట్లూరు మండలం జంగంరెడ్డి పేటకు చెందిన భీమిరెడ్డి సాయి రామనాథరెడ్డిని అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి 18 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఇటుకలపల్లి పోలీస్‌స్టేషనలో సీఐ మోహన అరెస్ట్‌ వివరాలు వెల్లడించారు.

వెంబడించి ఇంటిని కనుక్కుని...

పుట్లూరు మండలం జంగంరెడ్డి పేటకు చెందిన భీమిరెడ్డి సాయి రామనాథరెడ్డి ఆనలైనలో బెట్టింగ్‌ గేమ్స్‌ ఆడేవాడు. దీంతో పాటు ఇతర జల్సాలకు అలవాటు పడ్డాడు. తరచుగా అనంతపురం నగరా నికి వచ్చేవాడు. ఈ క్రమంలో అనంతపురం రూరల్‌ మండలం కందు కూరు గ్రామానికి చెందిన ఓ బాలికతో ఇనస్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్నాడు. ఆ బాలిక నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువు తోంది. ఆ పరిచయంలో భాగంగా ఆ బాలిక ఇంట్లో బంగారం ఉన్న ట్లు గ్రహించాడు. ఓరోజు ఆ బాలికను వెంబడించి ఇంటి అడ్రస్‌ తెలుసుకున్నాడు. నవంబరు 13న ఉదయం 10గంటల సమయంలో నేరుగా ఆ ఇంటికి వెళ్లాడు. బాలిక తల్లి కూలి పనికివెళ్లింది. ఇంట్లో ఉన్న ఆ బాలిక సమీపంలోనే ఉన్న తన తాత వాళ్లింటికి వెళ్లింది. ఇంటి తలుపులకు గెడ వేసి వెళ్లింది. ఇదే అదనుగా ఇంటిలోపలికి వెళ్లిన రామనాథరెడ్డి బీరువాను పగలకొట్టి అందులో ఉన్న 18.7 తులాల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. ఆ తరువాత ఇంట్లోకి వచ్చిన బాలిక జరిగిన విషయం గుర్తించి విషయాన్ని తన తల్లికి తెలిపింది. ఫిర్యాదు చేయడానికి వెనకాడినట్లు తెలిసింది. ఎట్టకేలకు మూడురోజుల క్రితం ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అపహరించిన సొత్తు బ్యాంకులో తాకట్టు

బాలిక తండ్రి కందుకూరులోని ఎఫ్‌సీఐ బియ్యం గోడౌనలో పని చేసేవాడు. 2015లో అతను చనిపోయాడు. దీంతో ఆ కుటుంబా నికి రూ.15లక్షల డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో తల్లి తనకుమార్తె కోసం బం గారం ఆభరణాలు చేయించింది. ఆ బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లిన నిందితుడు వాటిని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి, రూ.5 లక్షలు తీసుకున్నాడట. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి నుంచి బ్యాంకు స్లిప్‌లు స్వాధీనం చేసుకుని బ్యాంకును సంప్రదించారు. మొత్తం బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ మోహన, ఎస్‌ఐ శ్రీకాంతలు విచారణ చేపట్టారు. అందిన సమాచారం మేరకు జంగంరెడ్డిపేట సమీపంలోని బసిరెడ్డికుంట క్రాస్‌లో గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2022-12-10T00:26:30+05:30 IST