డ్రిప్‌, స్ర్పింక్లర్లపై 12శాతం జీఎస్టీని రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-11-24T23:55:34+05:30 IST

డ్రిప్‌, స్ర్పింక్లర్లు ఇతర పరికరాలపై 12శాతం జీఎస్టీని రద్దు చేయాలని ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

డ్రిప్‌, స్ర్పింక్లర్లపై 12శాతం జీఎస్టీని రద్దు చేయాలి

అనంత పురం కల్చరల్‌, నవంబరు 24: డ్రిప్‌, స్ర్పింక్లర్లు ఇతర పరికరాలపై 12శాతం జీఎస్టీని రద్దు చేయాలని ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక గణేనాయక్‌భవనలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెట్ట ప్రాంతాల్లో బిందు సేద్యాన్ని ప్రోత్సహించడానికి సబ్సిడీలు ఇస్తున్నామని ప్రభుత్వం ఓ వైపు ప్రచారం చేసుకుంటూ, మరోవె ౖపు స్ర్పింక్లర్ల పరికరాలపై 12శాతం జీఎస్టీ భారం మోపడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోతోందని, సాగుపెట్టుబడి కూడా రాలేదని, పండించిన పంటలకు గిట్టుబాటుధర, మద్దతుధర లేదని, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, జీఎస్టీని రద్దు చేయించాలని, లేదా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు ముందుకు రావాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివారెడ్డి, నాయకులు శ్రీనివాసులు, ఒన్నూరప్ప పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:55:34+05:30 IST

Read more