అనంతపురం జిల్లా: 2వేల గ్రామాలకు నిలిచిన త్రాగునీరు..

ABN , First Publish Date - 2022-02-19T15:41:22+05:30 IST

అనంతపురం: జిల్లాలో 2వేల గ్రామాలకు త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది.

అనంతపురం జిల్లా: 2వేల గ్రామాలకు నిలిచిన త్రాగునీరు..

అనంతపురం: జిల్లాలో 2వేల గ్రామాలకు త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీరు సరఫరా చేసే కార్మికులు సమ్మెబాట పట్టారు. వేతనాలు వచ్చేంతవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కూడేరు మండలం, పీఏబీఆర్‌ డ్యామ్ దగ్గర శుక్రవారం అర్ధరాత్రి మోటార్లు, నీటి పంపింగ్‌లను నిలిపివేశారు. తమకు నెల నెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు సకాలంలో రాకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more