అధికారమిస్తే.. అమరావతి నిర్మాణానికి రూ.10వేల కోట్లు: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-01-04T01:54:44+05:30 IST

గత ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లు ఇచ్చినా ప్రధాని మోదీ ఏపీకి రూ.50 వేల కోట్లను ఇచ్చారని చెప్పారు.

అధికారమిస్తే.. అమరావతి నిర్మాణానికి  రూ.10వేల కోట్లు: సోము వీర్రాజు

జగ్గయ్యపేట: ‘రాజధాని కడతామని చంద్రబాబు ఓడిపోయాడు.. ముఖ్యమంత్రి జగన్‌ వైజాగ్‌ పారిపోయాడు.. 2024లో బీజేపీకి అధికారాన్ని ఇస్తే రూ.10వేల కోట్లతో మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాం.. ’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లు ఇచ్చినా ప్రధాని మోదీ ఏపీకి రూ.50 వేల కోట్లను ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో దశ దిశ లేని జగన్‌రెడ్డి పాలన సాగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల వ్యవహారంలో పరిశ్రమ తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుందని చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో ట్రెండింగ్‌ సృష్టిస్తుంటే జగన్‌ కలరింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేసుకుంటున్నాడని వీర్రాజు ఎద్దేవా చేశారు.

Read more