-
-
Home » Andhra Pradesh » Amazon bumper offer-NGTS-AndhraPradesh
-
గీతం విద్యార్థినికి అమెజాన్ బంపర్ ఆఫర్
ABN , First Publish Date - 2022-08-31T08:46:13+05:30 IST
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విశాఖపట్నం క్యాంప్‌సకు చెందిన సీఎ్‌సఈ విద్యార్థిని కొమ్మరాజు జాహ్నవికి అమెజాన్ ఇండియా..

రూ.44.4 లక్షల వార్షిక వేతనంతో కొలువు
సాగర్‌నగర్ (విశాఖపట్నం), ఆగస్టు 30: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విశాఖపట్నం క్యాంప్‌సకు చెందిన సీఎ్‌సఈ విద్యార్థిని కొమ్మరాజు జాహ్నవికి అమెజాన్ ఇండియా రూ.44.4 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. ఈనెల 20 నుంచి నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 26 మందిని సంస్థ ఎంపిక చేసుకోగా, జాహ్నవికి అత్యధిక వేతనం లభించిందని, మరో 25 మందికి రూ.17.77 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తూ మంగళవారం ఫలితాలు ప్రకటించినట్టు గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ కాంపిటెన్సీ డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూస్ తెలిపారు. గాజువాక శ్రీనగర్‌కు చెందిన జాహ్నవి తండ్రి వెంకటసుధాకర్ జనరల్ స్టోర్ నడుపుతుంటారు. తల్లి ఉష గృహిణి. భారీ జీతంతో అమెజాన్ ఆఫర్ లభించడంపై జాహ్నవి మాట్లాడుతూ గీతంలో ప్రథమ సంవత్సరం నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూలను ఎదుర్కోవడంపై ఇచ్చిన శిక్షణ ఎంతో ఉపకరించిందని తెలిపింది.