పాదయాత్ర మార్గమంతా పూలమయం

ABN , First Publish Date - 2022-10-01T03:11:20+05:30 IST

ఏడుకొండలవాడి సాక్షిగా అమరావతి రాజధానిని ఆకాంక్షిస్తూ రైతులు ఆరంభించిన మహా పాదయాత్ర చిన్న తిరుపతికి చేరుకుంది

పాదయాత్ర మార్గమంతా పూలమయం

ఏలూరు: ఏడుకొండలవాడి సాక్షిగా అమరావతి రాజధానిని ఆకాంక్షిస్తూ రైతులు ఆరంభించిన మహా పాదయాత్ర చిన్న తిరుపతికి చేరుకుంది. స్థానికులు రోడ్లపై పూల పాన్పులు చేశారు. పసుపు నీళ్ళు చల్లారు. మహిళలకు హారతులు ఇచ్చారు. అమరావతి తిరుగులేదంటూ నినదించారు. చిరు జల్లులు కురుస్తున్నా ఖాతరు చేయకుండా చిన్నతిరుపతి వైపు ఒడిఒడిగా కదిలారు. వీరికి వందలాది మంది తోడయ్యారు. దారి పొడవునా వివిధ గ్రామ కూడళ్ళల్లో మహిళలు ఎదురేగి వచ్చి సూర్య రధం ముందు పసుపు నీళ్ళు పోసి అమరావతి ఆకాంక్ష నెరవేరేలా చూడాలని మొక్కుకున్నారు. రథం వెంబడి అనుసరిస్తున్న మహిళలను దగ్గరుండి మరీ దీవించారు. వయోభారాన్ని లెక్క చేయకుండా వృద్ధులు 19వ రోజు 16 కిలోమీటర్ల మేర నడక సాగించగా వీరికి చిన్నారులు కూడా తోడయ్యారు. 

Read more