గంజాయి సేవిస్తున్న ఎనిమిది మంది అరెస్టు

ABN , First Publish Date - 2022-08-22T12:12:31+05:30 IST

అమ లాపురం సావరం రోడ్డులో యువకులు గంజా యి సేవిస్తున్నారన్న సమాచా రంతో పట్టణ సీఐ ఎస్‌సీహెచ్‌ కొండలరావు ఆధ్వర్యంలో

గంజాయి సేవిస్తున్న ఎనిమిది మంది అరెస్టు

అమలాపురం: అమ లాపురం సావరం రోడ్డులో యువకులు గంజా యి సేవిస్తున్నారన్న సమాచా రంతో పట్టణ సీఐ ఎస్‌సీహెచ్‌ కొండలరావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్‌ఐ టి.శ్రీనివాస్‌ పోలీసులతో ఆదివారం దాడి నిర్వహించారు. గంజాయి తాగుతున్న ఎనిమిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అమలాపురానికి చెందిన నలుగురు, ముమ్మిడివరం, రావులపాలెం ప్రాంతాల కు చెందిన మరో నలుగురిని అరెస్టు చేసి అమలాపురం కోర్టులో హాజరుపరిచారు. అరెస్టయిన వారిలో విత్తనాల అవినాష్‌, సాధనాల హరీష్‌, చోడపనీడి రాజు, రాయుడు సూరిబాబు, త్రిపురాని సాయిసూర్యజగదీష్‌, పలివెల చరణ్‌, యాగా వీరబాబు, కడలి గణేష్‌ ఉన్నారు. వీరికి కోర్టు రిమాండు విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించినట్టు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. 

Read more