Amalapuram అల్లర్లపై స్పందించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2022-05-26T22:17:12+05:30 IST

అమలాపురం అల్లర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందమైన కోనసీమలో

Amalapuram అల్లర్లపై స్పందించిన చంద్రబాబు

అమరావతి: అమలాపురం అల్లర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందమైన కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదేనని దుయ్యబట్టారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారని, మంటలార్పేందుకు ఫైరింజన్‌ కూడా రాలేదని తప్పుబట్టారు. ఇళ్లను వాళ్లే తగులబెట్టుకుని వేరే వాళ్లపై నిందిలేస్తున్నారని మండిపడ్డారు. మధ్యంతర ఎన్నికలకు సీఎం జగన్‌ సిద్ధపడుతున్నారని చంద్రబాబు తెలిపారు.

Read more