ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు 22న

ABN , First Publish Date - 2022-09-19T09:26:16+05:30 IST

ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు 22న

ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు 22న

అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌లో 98,924 మంది ఆప్షన్లు పెట్టుకున్నారు. మొత్తం 1,02,133 మంది రిజిస్ర్టేషన్‌ చేసుకోగా 3,209 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొనలేదు. కాగా, ఆదివారంతో వెబ్‌ ఆప్షన్లు, వాటిని మార్చుకునే గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.25 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉంటే కేవలం 98,924 మంది మాత్రమే ఆప్షన్లు పెట్టుకున్నారు. దీంతో కాలేజీల్లో చేరేవారి సంఖ్య ఇంకా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. 

Read more