‘ఆ కనీస జ్ఞానం పోలీసులకు లేదా?’

ABN , First Publish Date - 2022-10-01T22:26:36+05:30 IST

‘ఆ కనీస జ్ఞానం పోలీసులకు లేదా?’

‘ఆ కనీస జ్ఞానం పోలీసులకు లేదా?’

అమరావతి: వైసీపీ వైఫల్యాలు, తప్పుల్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేయటం దుర్మార్గమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. చింతకాయల విజయ్ ఇంట్లో ఎవరూ లేకుండా చూసి పని మనుషుల్ని అదుపులోకి తీసుకోవడం జగన్ రెడ్డి అరాచక పాలనకు పరాకాష్ట అన్నారు. సోషల్ మీడియాపై సుప్రీం కోర్టు, అటార్నీ జనరల్ ఇచ్చినా ఆదేశాలు  వైసీపీ ప్రభుత్వం పాటించటం లేదన్నారు. అరెస్టు చేసే ముందు 41ఏ నోటీసు ఇవ్వాలన్నా కనీస జ్ఞానం పోలీసులకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం, న్యాయాస్దానాల కంటే నేను చెప్పిందే వేదం అన్నట్టు జగన్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గుంటూరులో బి.పి మండల్ విగ్రహ దిమ్మె కూల్చారన్నారు. జగన్ రెడ్డి బీసీలపై కక్ష్య సాధిస్తున్నారని చెప్పారు. నియంత పాలనకు కాలం చెల్లిందన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. వైసీపీ తొత్తుగా వ్యహరిస్తున్న పోలీసు అధికారుల లెక్కలు తేలుస్తామన్నారు. 

Updated Date - 2022-10-01T22:26:36+05:30 IST