AP NEWS: ఎమ్మెల్యే శిల్పారవిపై అఖిలప్రియ ఫైర్

ABN , First Publish Date - 2022-09-25T23:40:44+05:30 IST

ఎమ్మెల్యే శిల్పారవిపై మాజీ మంత్రి అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గురించి మాట్లడే స్థాయి శిల్పారవికి లేదన్నారు.

AP NEWS: ఎమ్మెల్యే శిల్పారవిపై అఖిలప్రియ ఫైర్

నంద్యాల: ఎమ్మెల్యే శిల్పారవి(Shilparavi)పై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ(Akhilapriya) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) గురించి మాట్లాడే స్థాయి శిల్పారవికి లేదన్నారు. టీడీపీ నాయకులు, పార్టీ గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. జగన్మోహన్‌రెడ్డి (jagan reddy) జైలుకు వెళ్లినప్పుడు, పార్టీ స్థాపించినప్పుడు ఆయన వెంట లేని వాళ్లు వెన్నుపోటు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆళ్లగడ్డలో ఆర్టీసికి, ఇండోర్ స్టేడియానికి ఎకరాల స్థలం దానం చేసిన ఘనత తమదని చెప్పారు. శిల్పా కుటుంబం ఇప్పటి వరకు ఒక సెంటు భూమి కూడా దానం చేసిన చరిత్ర లేదని అఖిలప్రియ పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-25T23:40:44+05:30 IST