పిచ్చోడి చేతికి ఏకే 47 ఇచ్చినట్టుంది: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2022-08-15T08:30:21+05:30 IST

పిచ్చోడి చేతికి ఏకే 47 ఇచ్చినట్టుంది: తులసిరెడ్డి

పిచ్చోడి చేతికి ఏకే 47 ఇచ్చినట్టుంది: తులసిరెడ్డి

గంగాధరనెల్లూరు, ఆగస్టు 14: ఏపీలో మూడేళ్ళ వైసీపీ పరిపాలన చూస్తే పిచ్చోడి చేతికి ఏకే47 ఇచ్చినవిధంగా ఉందని పీసీసీ వర్కింగ్‌కమిటీ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శించారు. 75వ స్వాతంత్య్ర దిన వేడుకలను పురస్కరించుకుని ఈనెల 11న జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పలమనేరులో పాదయాత్ర ప్రారంభించి బంగారుపాాళ్యం, చిత్తూరు మీదుగా గంగాధరనెల్లూరు వరకు 80కిలోమీటర్లు సాగింది. ఈ సందర్భంగా జరిగిన పాదయాత్ర ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీలంక కంటే ఈరాష్ట్రం అప్పులో ఎక్కువగా ఉన్నాయన్నారు. వైసీపీని దిగంబర పార్టీ అనాలా, రాసలీల పార్టీ అనాలా, కామాంధుల పార్టీ అనాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. 


Read more