ప్రాణాలు తీసే ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు కట్టించాం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-01-28T20:17:54+05:30 IST

బీజేపీ నేత సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ‘మేము అధికారంలోకొస్తే రూ.50కే చీప్‌ లిక్కర్‌ బాటిల్‌ ఇస్తాం’ అంటూ వీర్రాజు ప్రకటించి అభాసుపాలయ్యారు.

ప్రాణాలు తీసే ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు కట్టించాం: సోము వీర్రాజు

కడప: బీజేపీ నేత సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ‘మేము అధికారంలోకొస్తే రూ.50కే చీప్‌ లిక్కర్‌ బాటిల్‌ ఇస్తాం’ అంటూ వీర్రాజు ప్రకటించి అభాసుపాలయ్యారు. మరీ ఇంత ‘చీప్‌’గా ఎలా మాట్లాడతారంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. సోము వైన్స్‌.. సారాయి వీర్రాజు అంటూ నెటిజన్లు ఆయనను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. ఇతర పార్టీల నేతలు, సామాన్యులతోపాటు సొంతపార్టీ కార్యకర్తలు సైతం వీర్రాజు వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం  వ్యక్తం చేశారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు పరువు పోయిన తర్వాత నా వ్యాఖ్యలను వక్రీకరించారని ప్రకటించారు.


ఈ వివాదం ఇంకా చల్లార ముందే మరోసారి కడప ఎయిర్‌పోర్ట్‌పై శుక్రవారం సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు తీసే ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు కట్టించామని, వాళ్లకు ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసని అన్నారు. ఎయిర్‌పోర్ట్‌ల విషయం కేంద్రం చూసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు సరిగా వేయాలని సోము వీర్రాజు సూచించారు. వీర్రాజు వ్యాఖ్యలపై విమర్శలు వెళ్లువెత్తున్నాయి. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కడప జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. 

Read more