రైతాంగం అంటే ప్రభుత్వానికి లెక్కలేదు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-03-05T00:29:40+05:30 IST

రైతాంగం అంటే ప్రభుత్వానికి లెక్కలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దేశంలోనే తొలిసారిగా విద్యుత్‌ సంస్కరణలు తెచ్చిన

రైతాంగం అంటే ప్రభుత్వానికి లెక్కలేదు: చంద్రబాబు

అమరావతి: రైతాంగం అంటే ప్రభుత్వానికి లెక్కలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దేశంలోనే తొలిసారిగా విద్యుత్‌ సంస్కరణలు తెచ్చిన ఘనత టీడీపీదేనని చెప్పారు. తెలుగు రైతు ముగింపు సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ మోటార్లకు మీటర్లు పెట్టకుండా రైతాంగం అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలోనే రైతులకు అభివృద్ధి జరిగిందని తెలిపారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో మిగులు కరెంట్ ఉండేదన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే అది రైతుల మెడకు ఉరితాడేనని చెప్పారు. ఒక్క ఛాన్స్ అన్నాడు రెండేళ్లలో శాశ్వతంగా పోతాడని సీఎం జగన్‌ను ఉద్దేశించి దుయ్యబట్టారు. రెండేళ్లలో అధికారం నుంచి పోయేలోగా నాశనం చేస్తానంటే చూస్తూ ఉూరుకుంటామా? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి స్వర్ణయుగమని చంద్రబాబు తెలిపారు.

Read more