Nara Lokesh: గరిష్ట వయో పరిమితిని పెంచాలి
ABN , First Publish Date - 2022-12-12T16:58:26+05:30 IST
Amaravathi: పోలీసు ఉద్యోగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని ఐదేళ్లకు పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ పోలీసు నియామకాల బోర్డు చైర్ పర్సన్‌కి లేఖ రాశారు. ఏటా

Amaravathi: పోలీసు ఉద్యోగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని ఐదేళ్లకు పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ పోలీసు నియామకాల బోర్డు చైర్ పర్సన్‌కి లేఖ రాశారు. ఏటా పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు..మూడున్నరేళ్ల తర్వాత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. గరిష్ట వయోపరిమితి పెంచకపోతే ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి శిక్షణ తీసుకుంటున్న ఎంతోమంది నిరుద్యోగులు అనర్హులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి 5 సంవత్సరాలు పెంచిందని గుర్తు చేశారు.
Read more