‘ఆదిత్య’లో ఘనంగా అచీవర్స్‌ డే

ABN , First Publish Date - 2022-04-24T09:27:25+05:30 IST

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్రూప్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో..

‘ఆదిత్య’లో ఘనంగా అచీవర్స్‌ డే

గండేపల్లి, ఏప్రిల్‌ 23: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్రూప్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో తృతీయ సంవత్సరం చదువుతూ వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శనివారం కళాశాలలో అచీవర్స్‌ డే పేరిట సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల వైస్‌చైర్మన్‌ సతీ్‌షరెడ్డి మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో 126 కంపెనీల్లో రూ.31లక్షల వరకు వార్షిక వేతనంతో 3,120 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహించిన చైర్మన్‌ శేషారెడ్డికి  కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ మేడపాటి శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


అమెజాన్‌లో రూ.31.31లక్షల వార్షిక వేతనం

ఆదిత్యలో సీఎస్సీ ఫైనల్‌ ఈయర్‌ చదువుతున్నా. ఇటీవల కళాశాల క్యాంప్‌సలో అమెజాన్‌ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో రూ.31.31లక్షల వార్షిక వేతనంతో హైదరాబాద్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యా. నాకు ఉద్యోగం రావడానికి ప్రోత్సహించిన ఆదిత్య విద్యాసంస్థలకు కృతజ్ఞతలు.

- మజ్జి టేవిట్‌ సాయి, విజయనగరం

Read more