ఏపీ, తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు: జయప్రద

ABN , First Publish Date - 2022-06-07T23:58:02+05:30 IST

జన్మభూమి రాజమండ్రి అని.. ఖర్మ భూమి ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) అని.. అవి తనకు రెండు కళ్ళలాంటివని సినీ నటి జయప్రద

ఏపీ, తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు: జయప్రద

రాజమండ్రి(Rajahmundry): జన్మభూమి రాజమండ్రి అని..కర్మ భూమి ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) అని.. అవి తనకు రెండు కళ్ళలాంటివని సినీ నటి జయప్రద (Jayaprada) అన్నారు. బీజేపీ రాజమండ్రి సభలో ఆమె మాట్లాడుతూ అప్పులప్రదేశ్‎ను స్వర్ణాంధ్రగా మార్చటానికి జేపీ నడ్డా వచ్చారన్నారు. అన్నదాత సుఖంగా ఉన్నారా.. అన్నం లేకుండా ఉన్నారా అని జయప్రద ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయకుండా ఏపీ (Ap)లో ఏడు లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ఏపీ, తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఆడపిల్ల బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు తల్లి గడప దగ్గర ఎదురు చూస్తుంటుందని జయప్రద వ్యాఖ్యానించారు.

Read more