అనుమతుల్లేని రొయ్యల సాగుపై చర్యలే

ABN , First Publish Date - 2022-09-21T08:39:43+05:30 IST

అనుమతుల్లేని రొయ్యల సాగుపై చర్యలే

అనుమతుల్లేని రొయ్యల సాగుపై చర్యలే

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తీర్పు  

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా రొయ్యల సాగు చేపడితే చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది.  అనుమతులు లేకుండా కొంత మంది వ్యవసాయ భూముల్లో రొయ్యల సాగు చేస్తున్నారని, స్వర్ణముఖి నదిలోకి ఆ వ్యర్థజలాలను వదిలివేయడం వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సభ్యనిపుణుడు సత్యగోపాల్‌ కొర్లపాటితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అనుమతులు లేకుండా చేస్తున్న రొయ్యల సాగును గుర్తించి షోకాజ్‌ నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశించింది.   


Read more