విజ్ఞాన్‌ వర్సిటీ నూతన విసీగా ఆచార్య నాగభూషణ్‌

ABN , First Publish Date - 2022-04-05T09:30:59+05:30 IST

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం నూతన వైస్‌ చాన్సలర్‌గా ఆచార్య పి.నాగభూషణ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజ్ఞాన్‌ వర్సిటీ 5వ వీసీగా కొనసాగనున్నారు. నాగభూషణ్‌ గతంలో...

విజ్ఞాన్‌ వర్సిటీ నూతన విసీగా ఆచార్య నాగభూషణ్‌

గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 4: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం నూతన వైస్‌ చాన్సలర్‌గా ఆచార్య పి.నాగభూషణ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజ్ఞాన్‌ వర్సిటీ 5వ వీసీగా కొనసాగనున్నారు. నాగభూషణ్‌ గతంలో అలహాబాద్‌లోని ప్రయాగరాజ్‌ ఐఐఐటీ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించారు.  విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, చాన్సలర్‌ ఆచార్య కె. రామ్మూర్తినాయుడు, న్యూఢిల్లీలోని యుజీసీ మాజీ చైర్మన్‌ ఆచార్య హెచ్‌. దేవరాజ్‌, ఆంధ్రా వర్శిటీ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, న్యూఢిల్లీలోని  మినిసి్ట్రీ ఆఫ్‌ సైన్స్‌అండ్‌ టెక్నాలజీ విభాగం  సీనియర్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ టీఎస్‌ రావ్‌, ఆచార్య బీవీఆర్‌ చౌదరి, హైదరాబాద్‌లోని యునైటెడ్‌ హెల్త్‌సిస్టమ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వె.ౖ శరత్‌ తదితరులు నూతన వీసీకి  పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Read more