వివేకా కేసులో ప్రధాన నిందితుడు జగన్‌: కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2022-02-19T21:44:40+05:30 IST

వివేకా కేసులో ప్రధాన నిందితుడు జగన్‌: కొల్లు రవీంద్ర

వివేకా కేసులో ప్రధాన నిందితుడు జగన్‌: కొల్లు రవీంద్ర

అమరావతి: మాజీమంత్రి వివేకా కేసులో ప్రధాన నిందితుడు సీఎం జగన్‌రెడ్డేనని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌తో పాటు అతని కుటుంబసభ్యులను సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఎంపీ అవినాష్‌రెడ్డిని సానుభూతితో గెలిపించుకునేందుకు.. వివేకాను హత్య చేసి సొంత మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. వివేకా కుమార్తె పోరాటంతో నిజాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. సీబీఐ నిష్పక్షపాతంగా విచారించి దోషులను శిక్షించాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.

Read more