బలహీనపడిన వాయుగుండం

ABN , First Publish Date - 2022-09-13T08:10:55+05:30 IST

దక్షిణ ఒడిశాలో ఆదివారం ఏర్పడిన వాయుగుండం సోమవారం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది.

బలహీనపడిన వాయుగుండం

18న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

విశాఖపట్నం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): దక్షిణ ఒడిశాలో ఆదివారం ఏర్పడిన వాయుగుండం సోమవారం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మధ్యప్రదేశ్‌, విదర్భ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. అయితే రుతుపవన ద్రోణి తూర్పుభాగం దక్షిణాది వైపు కొనసాగడంతో సముద్రం నుంచి తేమగాలులు ఉత్తర కోస్తాపైకి వీస్తున్నాయి. దీని ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 18న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని పేర్కొంది.


Read more