-
-
Home » Andhra Pradesh » A symbol of dharma protection-NGTS-AndhraPradesh
-
ధర్మ పరిరక్షణకు ప్రతీక ‘దేవుని స్వరం’ పుస్తకం: జస్టిస్ సోమయాజులు
ABN , First Publish Date - 2022-09-08T09:06:58+05:30 IST
ధర్మ పరిరక్షణకు ప్రతీక ‘దేవుని స్వరం’ పుస్తకం: జస్టిస్ సోమయాజులు

సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 7: ధర్మ పరిరక్షణ, మానవతా విలువలకు ప్రతీకగా దేవుని స్వరం పుస్తకం నిలుస్తుందని.. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎస్‌ఎస్ సోమయాజులు అన్నారు. కాకినాడ జిల్లా తిమ్మాపురం ఆకొండి లక్ష్మీస్మారక గోశాల ప్రాంగణంలో కంచి మహాస్వామి పీఠారోహణ శతాబ్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమహాస్వామి అనుగ్రహ భాషణం తెలుగు అనువాదం.. దేవుని స్వరం పుస్తకాన్ని కంచికామకోటి పీఠాధిపతి, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలసి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే ఉన్నత విలువలు గల పుస్తకావిష్కరణలో భాగస్వామి కావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావుకు స్వామీజీ.. కామకోటి సేవారత్న బిరుదును ప్రదానం చేసి స్వర్ణ కంకణం తొడిగి ఘనంగా సత్కరించారు.