ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2022-09-29T22:02:56+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. విస్తరణ అధికారుల ఉద్యోగ నియామకాల్లో ఏపీ సర్కార్‌ (AP Govt)కు ఎదురుదెబ్బ తగిలింది.

ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. విస్తరణ అధికారుల ఉద్యోగ నియామకాల్లో ఏపీ సర్కార్‌ (AP Govt)కు ఎదురుదెబ్బ తగిలింది. స్త్రీ శిశు సంక్షేమశాఖలో విస్తరణ నియామకాలపై ఏపీ హైకోర్టు (AP High Court) స్టే ఇచ్చింది. 560 మంది విస్తరణ అధికారుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే రాత పరీక్షలు నిర్వహించి, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్ టెస్ట్‌ను  సర్కార్‌ నిలిపేసింది. ముందుగా కొందరు అభ్యర్థులను ఎంపిక చేసుకుని.. వారికే లాంగ్వేజ్ టెస్ట్‌ పెట్టారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరపున లాయర్ జడ శ్రవణ్‌కుమార్ వాదించారు. విస్తరణ అధికారి నియామకానికి రూ.10 లక్షలు వసూలు చేశారని లాయర్ కోర్టుకు తెలిపారు. అర్హులకు అన్యాయం జరుగుతోందని శ్రవణ్‌కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం.. అన్ని జోన్‌లలో నియామక ప్రక్రియపై స్టే విధించింది. 6 వారాల్లో స్టే వెకేషన్‌ అనంతరమే నియామక ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2022-09-29T22:02:56+05:30 IST