అరసవల్లికి భక్తుల తాకిడి

ABN , First Publish Date - 2022-11-20T23:54:48+05:30 IST

అరసవల్లి సూర్యనారాయణస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే క్యూలైన్‌లో బారులుదీరారు. మధ్యాహ్నం వరకూ రద్దీ కొనసాగింది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి సైతం భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

అరసవల్లికి భక్తుల తాకిడి
క్యూలో బారులు దీరిన భక్తులు

కిటకిటలాడిన క్యూలైన్లు

ఆదివారం ఒక్కరోజే రూ.13,52,481ల ఆదాయం

అరసవల్లి : అరసవల్లి సూర్యనారాయణస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే క్యూలైన్‌లో బారులుదీరారు. మధ్యాహ్నం వరకూ రద్దీ కొనసాగింది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి సైతం భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కేశఖండన శాల దాటి క్యూలైన్‌లో భక్తులు బారులుదీరడం కనిపించింది. ఆలయం ముందు తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆదివారం ఒక్కరోజే ఆలయానికి రూ.13,52,481లు ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.9,28,000లు, విరాళాల ద్వారా రూ.64,481లు, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.3,60,000లు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. స్వామివారిని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్‌ రమాకాంత్‌ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డిలు దర్శించుకున్నారు.

కార్తీక బహుళ ఏకాదశి(మతత్రయ)ని పురస్కరించుకుని ఆదివారం సూర్యనారాయణస్వామి వారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ పర్యవేక్షించారు.

Updated Date - 2022-11-20T23:54:48+05:30 IST

Read more