మంత్రిపై ఆరోపణలు చేసిన మహిళపై కేసు

ABN , First Publish Date - 2022-12-30T03:01:36+05:30 IST

రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌, ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన మహిళపై కేసు నమోదు చేశామని అనంతపురం జిల్లా శెట్టూరు ఎస్‌ఐ యువరాజు గురువారం తెలిపారు.

మంత్రిపై ఆరోపణలు చేసిన మహిళపై కేసు

శెట్టూరు, డిసెంబరు 29: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌, ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన మహిళపై కేసు నమోదు చేశామని అనంతపురం జిల్లా శెట్టూరు ఎస్‌ఐ యువరాజు గురువారం తెలిపారు. మూడ్రోజుల క్రితం కైరేవులో టీడీపీ నిర్వహించిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఈడిగ కవిత అనే మహిళ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. దీనిపై కైరేవు సర్పంచ్‌ లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కవితను శెట్టూరు మండలం ముద్దలాపురంలో బుధవారం గడప గడపకు కార్యక్రమంలో ఉన్న మంత్రి ఉష శ్రీచరణ్‌ వద్దకు కొందరు తీసుకువెళ్లారు. ఆమెను మంత్రి ‘టీడీపీ నాయకులు ఇలా చెప్పమన్నారా..?’ అని అడిగారు. సమస్యల గురించి మాట్లాడమన్నారని ఆమె చెబుతున్నా, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు చేయించారని మంత్రి విమర్శించారు.

Updated Date - 2022-12-30T03:01:36+05:30 IST

Read more