అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద బ్రాహ్మణ కుటుంబం నిరసన

ABN , First Publish Date - 2022-07-02T16:51:42+05:30 IST

జిల్లాలోని అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ఓ బ్రాహ్మణ కుటుంబం శనివారం ఉదయం నిరసనకు దిగింది.

అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద బ్రాహ్మణ కుటుంబం నిరసన

పల్నాడు: జిల్లాలోని  అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ఓ బ్రాహ్మణ కుటుంబం శనివారం ఉదయం నిరసనకు దిగింది. పేద బ్రాహ్మణుల పోలం కౌలువేలం జరిపారంటూ ఆందోళన చేపట్టింది. సదావర్తిసత్రం సంభందించిన కెవీ పాలెంలోని వ్యవసాయ భూమిలో తన పొలంతో కలిపి కౌలువేలం జరిపారంటూ పురుషోత్తమ ప్రసాద్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమకు చెందిన పొలం కౌలువేలంపాట నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తమకు చెందిన వ్యవసాయ భూమి కౌలువేలం వేయడానికి వీలులేదన్నారు. వ్యవసాయ భూమిపై తమకు పూర్తి హక్కులున్నాయన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఈవో అక్రమంగా బహిరంగ కౌలువేలం జరిపారని మండిపడ్డారు. తనకు న్యాయం చేయాలని...లేని పక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పురుషోత్తమ ప్రసాద్ శర్మ ఆవేదన చెందాడు. 

Read more