‘80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు’

ABN , First Publish Date - 2022-09-25T22:23:18+05:30 IST

80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి దేవినేని ఉమ

‘80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు’

కృష్ణా: 80 మంది వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి దేవినేని ఉమ (Former Minister Devineni Uma) వెల్లడించారు. సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని వ్యక్తి కుప్పంలో ఏం పీకుతాడని సీఎం జగన్‌ (CM Jagan)ను ఉద్దేశించి ఎద్దేవాచేశారు.  నందివాడ మండలంలో అమరావతి రైతుల మహా పాదయాత్రలో మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవినేని మాట్లాడుతూ ప్రభుత్వం కుతంత్రాలు చేసినా గుడివాడలో పాదయాత్ర జరిగిందని తెలిపారు. పాదయాత్ర జరుగుతుంటే వీధిలైట్లు తియించే స్థాయికి.. మాజీ బూతుల మంత్రి దిగజారాడని దుయ్యబట్టారు. జగన్ గ్యాంగ్‌ విశాఖలో భూములను కబ్జా చేశారని ఆరోపించారు. రుషి కొండను.. బోడికొండగా మార్చారని దేవినేని ఉమ ధ్వజమెత్తారు.


అమరావతి రైతుల మహాపాదయాత్రతో గుడివాడ పట్టణం దద్దరిల్లింది. మహాపాదయాత్రకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన రైతులతో పురవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇక్కడి రాజకీయ పరిణామాల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ముగ్గురు ఏఎస్పీల పర్యవేక్షణలో ఆరుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, సీఆర్పీఎఫ్‌ దళాలు రెండు, 600 మందికి పైగా పోలీసుల పర్యవేక్షణలో పాదయాత్ర ఆద్యంతం ఉత్కంఠభరిత వాతావరణంలో సాగింది. అంతకుముందే సీఆర్పీఎఫ్‌ దళాలు పట్టణంలో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించాయి. కొత్త మునిసిపల్‌ కార్యాలయం, శరత్‌ థియేటర్‌ సెంటర్‌ వద్ద పహారా ఏర్పాటు చేశాయి. శ్రీనివాసుడి రథంతో పాటు వెనుక నడుస్తున్న మహిళా రైతులకు పోలీసులు ప్రత్యేక రక్షణ కల్పించారు. 

Read more