లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బొలెరో.. నలుగురికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-03-04T16:00:04+05:30 IST

కృష్ణా జిల్లా తిరువూరు - విజయవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి లారీని వెనక నుంచి బొలెరో వాహనం ఢీ-కొట్టింది.

లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బొలెరో.. నలుగురికి తీవ్ర గాయాలు

విజయవాడ : కృష్ణా జిల్లా తిరువూరు - విజయవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి లారీని వెనక నుంచి బొలెరో వాహనం ఢీ-కొట్టింది. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 14 మంది ప్రయాణిస్తున్నారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమందికి చిన్నపాటి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం గాయపడిన నలుగురిని విజయవాడకు తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బొలెరో వాహనంలో తమిళనాడు నుంచి ఒరిస్సా వెళ్తున్నట్లు సమాచారం.

Read more