పల్నాడులో 3వేల ఏళ్ల నాటి నిలువు రాళ్లు

ABN , First Publish Date - 2022-09-28T08:43:21+05:30 IST

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంటలో 3వేల సంవత్సరాల నాటి నిలుపు రాళ్లు బయటపడ్డాయి. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, మాచర్లకు చెందిన చరిత్రకారుడు పావులూ

పల్నాడులో 3వేల ఏళ్ల నాటి నిలువు రాళ్లు

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంటలో 3వేల సంవత్సరాల  నాటి నిలుపు రాళ్లు బయటపడ్డాయి. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, మాచర్లకు చెందిన చరిత్రకారుడు పావులూరి సతీష్‌ వాటిని గుర్తించారు. కృష్ణానది కుడి గట్టుపై గల ముగ్గుదిన్నె కాల్వ వెంబడి మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో 1000కి పైగా నిలువు రాళ్లు ఉన్నాయి. ఇవి ఇనుప యుగం నాటి స్మారక కట్టడాలని శివనాగిరెడ్డి తెలిపారు. ఈ రాళ్లపై ఎద్దు, చదరం, గండ్రం, ముగ్గును పోలిన రేఖాచిత్రాలు ఉన్నాయి.


విజయవాడ కల్చరల్‌

Read more