ప్రతినెలా జగన్‌ ప్యాల్‌సకు 250 కోట్లు

ABN , First Publish Date - 2022-07-18T08:52:56+05:30 IST

ప్రతినెలా జగన్‌ ప్యాల్‌సకు 250 కోట్లు

ప్రతినెలా జగన్‌ ప్యాల్‌సకు 250 కోట్లు

మద్యం విక్రయాల అవినీతి సొమ్ము చేరుతోంది

బాబును పది మాటలంటే వంద అంటా:  బుద్దా 


విజయవాడ(వన్‌టౌన్‌), జూలై 17: మద్యం విక్రయాలలో అవినీతి ద్వారా నెలకు రూ.250 కోట్లు జగ న్‌ ప్యాల్‌సకు చేరుతోందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రశ్నించేవారి గొంతు నొక్కడమే ఈ ప్రభుత్వ ధ్యేయమన్నారు. జగన్‌కు ఓటేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రేపల్లె మండలంలో కల్తీ మద్యం సేవించి మృతిచెందిన బాధితుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి తాను బయలుదేరగా, తన ఫోన్‌ను ట్యాప్‌ చేసిన పోలీసులు తన కారును ముట్టడించారన్నారు. ఒక హంతకుడిని నిర్బంధించిన రీతిలో తనను పోలీసులు చుట్టుముట్టారన్నారు. ‘‘కొద్ది రోజుల క్రితం వరకు ఉత్తరాంధ్రకే పరిమితమైన విజయసాయిరెడ్డి ట్యాక్స్‌ ఇప్పుడు రాష్ట్రమంతా వ్యాపించింది. ఎక్సైజ్‌ శాఖకు డమ్మీ మంత్రిని పెట్టి అరాచకం చేస్తున్నాడు. గుట్కా నాణ్యత గురించి కొడాలి నానికి తెలిస్తే, మద్యం నాణ్యత గురించి వైసీపీ కార్యకర్తల ను అడిగితే తెలుస్తుంది. గజదొంగ విజయసాయి రెడ్డికి చంద్రబాబును విమర్శించే స్థాయి లేదు. చంద్రబాబును పది మాటలంటే, నేను వంద మాటలంటాను. విజయసాయు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి తప్పదు’’ అని బుద్దా వెంకన్న విమర్శించారు. 


Read more