-
-
Home » Andhra Pradesh » 24 hours for Srivara Sarvadarshan-NGTS-AndhraPradesh
-
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
ABN , First Publish Date - 2022-09-11T09:16:40+05:30 IST
తిరుమలలో శనివారం వారాంతపు రద్దీ నెలకొంది. రెండో శనివారంతోపాటు ఆదివారం వరస సెలవులు రావడంతో ఉదయం నుంచే కొండపై రద్దీ పెరిగింది.

తిరుమల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం వారాంతపు రద్దీ నెలకొంది. రెండో శనివారంతోపాటు ఆదివారం వరస సెలవులు రావడంతో ఉదయం నుంచే కొండపై రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంలో పాటు లడ్డూ కౌంటర్, అఖిలాండం, బస్టాండ్, అన్నప్రసాద భవనం ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. గదుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. శనివారం రాత్రి సమయానికి సర్వదర్శనం క్యూలైన్ లేపాక్షి, రాంభగీచ మీదు గా శ్రీవారిసేవా సదన్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. వీరికి 24 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది.