బాలికను మోసగించిన యువకుడికి 20ఏళ్ల జైలు

ABN , First Publish Date - 2022-08-31T08:57:04+05:30 IST

బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి గర్భవతిని చేసిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విజయవాడ మాచవరంలోని మారుతీనగర్‌కు చెందిన ఓ బాలికకు పక్కింట్లో ఉండే పట్నాల మహేష్‌

బాలికను మోసగించిన యువకుడికి 20ఏళ్ల జైలు

విజయవాడ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి గర్భవతిని చేసిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విజయవాడ మాచవరంలోని మారుతీనగర్‌కు చెందిన ఓ బాలికకు పక్కింట్లో ఉండే పట్నాల మహేష్‌ అనే యువకుడు వల వేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమలోకి దింపాడు. తర్వాత ఆమెను గర్భవతిని చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మాచవరం పోలీసులకు 2021 ఫిబ్రవరి రెండో తేదీన ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ పోక్సో కోర్టులో సాగింది. బాధితురాలి తరపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జీవీ నారాయణరెడ్డి వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నిందితుడు మహే్‌షకు 20ఏళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి డాక్టర్‌ ఎస్‌.రజని మంగళవారం తీర్పును ఇచ్చారు. బాధితురాలికి రూ.4 నుంచి 7లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

Read more