అత్యాచారం కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు

ABN , First Publish Date - 2022-09-08T09:46:38+05:30 IST

అత్యాచారం కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు

అత్యాచారం కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు

కర్నూలు(లీగల్‌) సెప్టెంబరు 7: అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలు, జరిమానా విధిస్తూ కర్నూలు 7వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి భూపాల్‌రెడ్డి బుధవారం తీర్పు చెప్పారు. 2016 డిసెంబరు 11న బాధితురాలిపై సి.ఎల్లన్న, సి.శివకళాధర్‌ అత్యాచారం చేశారు. బాధితురాలు తల్లితో కలిసి 2017 జనవరి 10న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై నేరం రుజువు కావడంతో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు ఎల్లన్నకు రూ.11 వేలు, శివకళాధర్‌కు రూ.10 వేలు చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Read more