ప్రైవేటు పాఠశాలలకు 1.81కోట్ల పాఠ్యపుస్తకాలు

ABN , First Publish Date - 2022-09-08T09:40:25+05:30 IST

ప్రైవేటు పాఠశాలలకు 1.81కోట్ల పాఠ్యపుస్తకాలు

ప్రైవేటు పాఠశాలలకు 1.81కోట్ల పాఠ్యపుస్తకాలు

అమరావతి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల కోసం ఈ ఏడాది 1,81,82,913 పాఠ్యపుస్తకాలు ముద్రించినట్లు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల డైరెక్టర్‌ కె.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 11,990 పాఠశాలల కోసం వీటిని ముద్రించగా 9,995 బడులు పుస్తకాలు తీసుకున్నాయన్నారు. మిగిలిన స్కూళ్ల కోసం జిల్లా, మండల కేంద్రాల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన యాజమాన్యాలు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి వాటిని పొందాలని సూచించారు. కాగా నిర్దేశించిన ధరలపై ప్రైవేటు పాఠశాలలకు కూడా ప్రభుత్వం ఈ ఏడాది నుంచి పాఠ్య పుస్తకాలు సరఫరా చేస్తోంది. సుమారు 20వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలుండగా 12వేల యాజమాన్యాలు ఇండెంట్‌ పెట్టాయి.


Read more