-
-
Home » Andhra Pradesh » 176 tons of fertilizers seized-NGTS-AndhraPradesh
-
176 టన్నుల ఎరువులు సీజ్
ABN , First Publish Date - 2022-08-31T08:50:20+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయశాఖ అధికారులు మం గళవారం

అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయశాఖ అధికారులు మం గళవారం మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. విశాఖ, ఒంగోలు, నెల్లూరు, నం ద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో 80 దుకాణాల్లో తనిఖీలు జరిపి, అధిక ధరలకు ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్న 27 మంది వ్యాపారులపై కేసులు నమో దు చేశారు. రూ.11.18 లక్షల విలువైన 176.57 టన్నుల ఎరువులు, రూ.6.29 లక్షల విలువైన 440 లీటర్ల పురుగు మందులను సీజ్ చేశారు.