ఆంధ్రా ఆలయాల బకాయి 1160 కోట్లు చెల్లించండి

ABN , First Publish Date - 2022-10-12T09:16:21+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు ప్రముఖ ఆలయాల నుంచి తెలంగాణకు రావాల్సిన కంట్రిబ్యూషన్‌ బకాయిల

ఆంధ్రా ఆలయాల బకాయి 1160 కోట్లు చెల్లించండి

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కోరిన తెలంగాణ అర్చక సమాఖ్య


హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు ప్రముఖ ఆలయాల నుంచి తెలంగాణకు రావాల్సిన కంట్రిబ్యూషన్‌ బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని తెలంగాణ అర్చక సమాఖ్య విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అర్చక సమాఖ్య వర్కింగ్‌ ప్రెసిడెంటు గంగు ఉపేంద్రశర్మ నేతృత్వంలో పలువురు మంగళవారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. 2004 నుంచి 2014 వరకు ఏపీ పరిధిలోని తిరుపతి, సింహాచలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గా, ద్వారకా తిరుమల ఆలయాల నుంచి తెలంగాణ ప్రాంత ఆలయాల వాటా కింద రూ. 1160 కోట్లు రావాల్సిఉందని తెలిపారు. తెలంగాణ మంత్రి, కమిషనర్‌ నుంచి ప్రతిపాదనలు వస్తే చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారని ఉపేంద్రశర్మ తెలిపారు.

Updated Date - 2022-10-12T09:16:21+05:30 IST