కారం బూందీ

ABN , First Publish Date - 2021-06-25T16:21:50+05:30 IST

బియ్యం పిండి- కప్పు, శనగపిండి- 4 కప్పులు, జీలకర్ర- స్పూను, పసుపు- చిటికెడు, నూనె, ఉప్పు- తగినంత, జీడిపప్పు- పన్నెండు, పల్లీలు- అర కప్పు, పుట్నాలు- అర కప్పు, కారం- స్పూను

కారం బూందీ

కావలసిన పదార్థాలు: బియ్యం పిండి- కప్పు, శనగపిండి- 4 కప్పులు, జీలకర్ర- స్పూను, పసుపు- చిటికెడు, నూనె, ఉప్పు- తగినంత, జీడిపప్పు- పన్నెండు, పల్లీలు- అర కప్పు, పుట్నాలు- అర కప్పు, కారం- స్పూను


తయారుచేసే విధానం: శనగపిండి, బియ్యం పిండి కలిపి ఉప్పు, పసుపు వేసి నీళ్లు పోసి గరిట జారుగా కలిపి ఓ అరగంట పక్కన పెట్టాలి. బాణలిలో నూనె బాగా కాగాక బూందీగరిట పై నుంచి పిండిని వేస్తూ వేయించాలి. మొత్తం వేగాక బూందీనంతా వెడల్పాటి పాత్రలో వేయాలి. ఓ చిన్న ప్యాన్‌లో కాస్త నూనె వేసి కాజూ పలుకుల్ని దోరగా వేయించి తీయాలి. ఇందులోనే పల్లీలు, పుట్నాలు, కరివేపాకు వేయించాలి. వీటన్నిటిని బూందీలో వేసి కారం కూడా చేర్చి పైకీ కిందకీ బాగా కలిపితే కరకరలాడే కారం బూందీ రెడీ.

Updated Date - 2021-06-25T16:21:50+05:30 IST