పెసరపప్పు పాలకూరతో...

ABN , First Publish Date - 2021-07-10T18:01:12+05:30 IST

పెసరపప్పు - పావుకేజీ, పెరుగు - అరకప్పు, పాలకూర - యాభై గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, జీలకర్ర - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - కొద్దిగా, ఉప్పు

పెసరపప్పు పాలకూరతో...

కావలసినవి: పెసరపప్పు - పావుకేజీ, పెరుగు - అరకప్పు, పాలకూర - యాభై గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, జీలకర్ర - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: పాలకూరను శుభ్రంగా కడిగి కట్‌ చేసుకోవాలి. ఉల్లిపాయను తరగాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర కట్‌ చేసి పెట్టుకోవాలి. పెసరపప్పును నాలుగైదు గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీటిని తీసివేసి పప్పును మిక్సీలో వేసి మెత్తటి మిశ్రమంలా పట్టుకోవాలి. మిశ్రమం గట్టిగా కాకుండా దోశ పిండిలా పట్టుకోవాలి. తరువాత అందులో పెరుగు, తరిగిన పాలకూర, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, దంచిన అల్లం, జీలకర్ర, పసుపు, కారం, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి కొద్దిగా నూనె రాసి వేడి అయ్యాక కాస్త మందంగా దోశ పోసుకోవాలి. నూనె వేసుకుంటూ రెండు వైపులా గోధుమరంగులోకి మారే వరకు కాల్చుకోవాలి. టొమాటో చట్నీతో వేడి వేడిగా తింటే మూంగ్‌దాల్‌ పాలక్‌ చీలా రుచి చాలా బాగుంటుంది.Read more