సింగరేణిపై కేంద్రం కన్ను: ఎంపీ నేతకాని

ABN , First Publish Date - 2021-12-10T02:43:34+05:30 IST

రాష్ట్రంలోని బొగ్గు గని సంస్థ సింగరేణిపై కేంద్రం కన్ను పడిందని ఎంపీ

సింగరేణిపై కేంద్రం కన్ను: ఎంపీ నేతకాని

హైదరాబాద్‌: రాష్ట్రంలోని బొగ్గు గని సంస్థ సింగరేణిపై కేంద్రం కన్ను పడిందని ఎంపీ నేతకాని వెంకటేష్‌ ఆరోపించారు. బుద్ధి, జ్ఞానం లేకుండా బండి సంజయ్, అర్వింద్ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సింగరేణి కార్మికుల అంశంపై బండి సంజయ్‌, అర్వింద్ పార్లమెంట్‌లో ఎప్పుడైనా అడిగారా అని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్‌, గుజరాత్‌లలో కోల్ బ్లాక్‌లను ఆ రాష్ట్రాలకే వేలానికి ఇచ్చారని ఆయన  పేర్కొన్నారు. మరి ఇక్కడి కోల్ బ్లాకులను తెలంగాణకు ఇవ్వడానికి అడ్డేంటని ఆయన ప్రశ్నించారు. 
Updated Date - 2021-12-10T02:43:34+05:30 IST